![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
లేటెస్ట్ గా బాలకృష్ణ గతంలో నటించిన హిట్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్న శర్వానంద్ తన తదుపరి సినిమాకు పవన్ కళ్యాణ్ గతంలో నటించిన క్లాసిక్ టైటిల్ తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘జానీ’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ నటించిన సినిమాలలో భయంకరమైన ఫ్లాప్ గా రికార్డు క్రియేట్ చేసిన ఈమూవీని పవన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈమూవీ ఫ్లాప్ అయినప్పటికీ దర్శకుడుగా పవన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా డిఫరెంట్ గా ఈసినిమాను తీస్తున్నారని తెలుస్తోంది. పవన్ సినిమాల టైటిల్స్ ను ఇతర హీరోల సినిమాలకు వాడుకోవడం గతంలో అనేక సార్లు జరిగింది.
విజయ్ దేవరకొండ ‘ఖుషి’ వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ అన్న టైటిల్స్ తో ఇప్పటికే సినిమాలలో నటిస్తే త్వరలో నితిన్ ‘తమ్ముడు’ టైటిల్ ని తన సినిమాకు తీసుకున్నాడు. యాంకర్ ప్రదీప్ కూడ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ ను తన సినిమాకు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల టైటిల్స్ అన్నీ యంగ్ హీరోలు వాడుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి పవన్ నటించిన ఒక్క సినిమా టైటిల్ కూడ మిగలదు అంటూ పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు..