![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-d8a1d847-3538-44ad-95e9-d269a69d667e-415x250.jpg)
ఆ తర్వాత స్టాలిన్ వచ్చి యావరేజ్ అయింది. మళ్ళీ శంకర్ దాదా జిందాబాద్ హిందీలో వచ్చిన సినిమా సక్సెస్ అవ్వగా ఆ సినిమాకు సీక్వెల్ మూవీ కూడా చిరు రీమేక్ చేశారు. మొదటి భాగానికి జయంత్ దర్శకత్వం వహిస్తే సీక్వెల్ కు మాత్రం ప్రభుదేవా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా కామెడీ వరకు మాత్రం ఓకే అనిపించుకున్నా .. ఓవరాల్ గా డిజాస్టర్ అయింది. మొదటి భాగంలో సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్ సోనాలి బింద్రే కాగా సీక్వెల్లో మాత్రం కరిష్మా కోటక్ అనే అమ్మాయి నటించింది. ఎంత చిరంజీవి ఏజ్కి తగ్గట్టు ఆమె తీసుకున్న మరి సగం వయసు అయిపోయిన ముదురు అమ్మాయిలా కనిపించింది. పోస్టర్స్ చూస్తేనే మెగా అభిమానులు చిరాకు పడ్డారు. అసలు ఎవరు ఈ అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసింది అని జనాలు తిట్టుకున్నారు. అలా ఈ సీక్వెల్ ప్లాప్ కావటానికి ప్రధాన కారణం హీరోయిన్ అన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి.