పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు.. ఈమె ఇప్పటివరకు ఎలాంటి బూతు పాత్రలో చేయకుండానే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.. ఆమెకు అంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం  న్యాచురల్ గా చేసే నటన అని చెప్పవచ్చు.. దీనికి తోడు లేడి పిల్లల డ్యాన్స్ చేయడం సాయిపల్లవికి మరింత పేరు తీసుకువచ్చింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో చేసిన కథను బేస్ చేసుకుని నటిస్తుంది..కథలో ఏమాత్రం బోల్డ్ నెస్ కనిపించిన ఆ సినిమాను ఒప్పుకోదు.. ఆ విధంగా కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో వైరం ఉందట..ఆయన పేరు పలకడానికి కూడా ఆమె ఇష్టపడరట.. వారెవరో చూద్దాం.. ప్రస్తుతం తండేల్ సినిమా ద్వారా  హిట్ సొంతం చేసుకుంది తండేల్ రాణి సాయిపల్లవి.. 

అయితే ఈమెకు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని అంటే ఇష్టం ఉండదని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది.. సాయిపల్లవి నాని కాంబినేషన్ లో శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు అద్భుతమైన హిట్ సాధించాయి. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే సాయిపల్లవి నానిమధ్య షూటింగ్ సెట్లో గొడవ జరిగిందట. అప్పటినుంచి వీరి మధ్య కాస్త మాటలు దూరమయ్యాయని తెలుస్తోంది..

కానీ నిర్మాత దిల్ రాజు కలగజేసుకొని వీరి మధ్య మళ్ళీ సయోధ్య కుదిరించారు. ఇక అప్పటినుంచి వీరు మాట్లాడుకుంటున్నారట.. వారికి షూటింగ్ సెట్లో గొడవ జరిగింది నిజమా, అబద్దమా అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్త కనిపిస్తోంది.. ఏది ఏమైనా  నాని సాయిపల్లవి కాంబినేషన్ లో ఏ చిత్రం వచ్చిన బారి హిట్ కొడుతోంది.. అలాంటి వీరి మధ్య గొడవలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు.. ఇక ఇదే తరుణంలో తాజాగా తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా నాకు నాగచైతన్య అంటే ఇష్టమని సాయిపల్లవి చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: