![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/venkatesh378380a5-0d62-4664-a0b8-46ca572e8295-415x250.jpg)
పక్క హీరో సినిమాకి ప్రమోషన్స్ లో హెల్ప్ చేయమన్నా చేయడం లేదు . కానీ మళ్ళీ ట్రెండ్ బ్యాక్ టు సెట్ చేస్తున్నారు హీరోలు. ప్రజెంట్ ఇప్పుడు ఒక హీరో నటించే సినిమాలో మరొక హీరో నటించడానికి కూడా ఓకే చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు బడా పాన్ ఇండియా స్టార్స్ నటించి ఎలా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసారు అన్న విషయం మనకి బాగా తెలుసు . కాగా అంతకుముందు "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమా అంటూ మహేష్ బాబు - వెంకటేష్ కూల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించి సూపర్ డూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తరువాత ఎఫ్2 , ఎఫ్3 అంటూ కూడా వరుణ్ తేజ్ తో మల్టీస్టారర్ మూవీలో నటించారు . కాగా ఇప్పుడు మరొకసారి వెంకటేష్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈసారి నేచురల్ స్టార్ నాని తో అంటూ కూడా వార్త బయటకు వచ్చింది. ధమాకా దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్ అదేవిధంగా నాని ఒక సినిమాకి కమిట్ అయ్యారట . ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఇవ్వబోతున్నారట . ఈ సినిమా కూడా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది . వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ అంటే ప్రత్యేకంగా చెప్పాలా జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేస్తారు . ఈ సినిమా కూడా మరొక హిట్ అవుతుంది అంటూ ఆశపడుతున్నారు . రీసెంట్ గానే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్.