![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/when-is-sankranthiki-vasthunnam-releasing-on-ottc6ca90df-d9ea-4195-9b94-77687a6fa4dd-415x250.jpg)
సంక్రాంతికి వస్తున్నాం మూవీ త్వరలో బుల్లితెరపై కూడా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో కంటే ముందే బుల్లితెరపై టెలీకాస్ట్ కానున్న సినిమాగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ 2027 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని వెంకటేశ్ పరోక్షంగా వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బుల్లిరాజు రోల్ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ గా నిలిచి సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తండేల్ రిలీజ్ తర్వాత కూడా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది.
వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వెంకటేశ్ రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. వెంకటేశ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలకు మాత్రమే ఓటు వేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ 2025 సంవత్సరానికి శుభారంభాన్ని ఇచ్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. సినిమా సినిమాకు హీరో వెంకటేశ్ రేంజ్ పెరుగుతోంది.