
ఈ సినిమా ఎంత హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో నాగచైతన్య మరో లెవెల్ ఎదిగాడనే చెప్పాలి. సాయి పల్లవి పర్ఫామెన్స్ తో చంపి పడేసింది . సాయి పల్లవి నాగచైతన్య కాంబో ఎప్పుడు సూపర్ డూపర్ హిట్ అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు. కాగా సినిమా సూపర్ డూపర్ హిట్ . లైఫ్ ప్రకారం కూడా ఆయన శోభిత దూళిపాళ్లతో బాగా సెటిల్ అయిపోయారు . కానీ ఆయనకి ఇంకా ఏదో ఒక వెలితి ఉండనే ఉండిపోయింది .
క్లాస్ సినిమాలలో బాగా నటిస్తాడు కానీ మాస్ సినిమాలు వచ్చేసరికి ఫ్లాప్ అవుతున్నాయి అంటూ రీసెంట్గా మీడియా ప్రెస్ మీట్ లో కూడా రిపోర్టర్స్ ప్రశ్నించారు . ఈ క్రమంలోనే నాగచైతన్య అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని నిర్ణయం తీసుకున్నట్లు వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య తన నెక్స్ట్ సినిమాను విరూపాక్ష డైరెక్టర్ తో కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ అయినట్లు తెలుస్తుంది . అయితే ఆ తర్వాత మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను తో కమిట్ అయ్యారట . ప్రజెంట్ బోయపాటి శ్రీను అఖండ 2 ని తెరకెక్కిస్తున్నారు . ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే నాగచైతన్య ని డైరెక్ట్ చేయబోతున్నారట బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను-నాగచైతన్య కాంబోలో సినిమాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు జనాలు . మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే నాగచైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!