![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/anchor-rashmi-injury-hospital-bed-photo-viral6db6cd87-9fcd-43cc-9d00-fdaaae31175e-415x250.jpg)
రష్మీ, సుధీర్ జోడి కి మంచి టిఆర్పి రేటింగ్ ఉన్నది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా తను సర్జరీ చేయించుకోవడానికి అన్ని సెట్ చేసుకున్నానని తెలియజేసింది.. గత కొద్ది రోజులుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నానని అందుకే ఈ సర్జరీ చేయించుకుంటున్నానని తెలియజేసినట్లు తెలుస్తోంది. దీనివల్లే తన డాన్స్ మూవ్మెంట్స్ చేయలేకపోతున్నానని ఇలా వాటన్నిటినీ కూడా మిస్ అవుతున్నానని తెలియజేసింది రష్మీ. సర్జరీ పూర్తి అయిన తర్వాత అన్ని సెట్ అవుతాయి అనుకుంటున్నానని తెలిపింది.
అయితే ఈ విషయం చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు రష్మి సర్జరీ కోసం సిద్ధమై బెడ్ మీద కూర్చున్న ఫోటోలను చూసి తన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రష్మీ అభిమానులకు సడన్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. రష్మీ తనకు సంబంధించిన విషయాలనే కాకుండా ఏవైనా మూగజీవాలపైన హింసించే విషయాల పైన కూడా స్పందిస్తూ ఉంటుంది. మరి రష్మీ ప్లేస్ లో యాంకర్ గా ఎవరు వస్తారో చూడాలి మరి.