గౌతమ్ మరియు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో బ్రహ్మ ఆనందం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా గౌతమ్ , బ్రహ్మానందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను భారీ ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. బ్రహ్మానందం కుమారుడు అయినటువంటి గౌతమ్ , రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత పలు సినిమాలలో నటించిన గౌతమ్ కు మంచి విజయాలు దక్కలేదు. దానితో కొంత కాలం పాటు గౌతమ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇకపోతే గౌతమ్ , బ్రహ్మానందం ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా ఫిబ్రవరి 11 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి , కన్వెన్షన్ సెంటర్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు దానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే గౌతమ్ , బ్రహ్మానందం ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చాలా మంది జనాలు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: