![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sai-pallavi902f44f2-a4c7-4a9d-b365-9de4bee829dc-415x250.jpg)
అమరన్ సినిమా ప్రమోషన్స్ లో తండేల్ సినిమా ప్రమోషన్స్ లో.. సాయి పల్లవి ఎంత సింపుల్ లుక్స్ లో మెరిసింది అనే విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడు సాయి పల్లవి "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునింది. అయితే సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాత్రం పాల్గొనడం లేదు . సాయి పల్లవికి హెల్త్ బాగోలేదు అంటూ కూడా తెలుస్తుంది . ఆమెకు డాక్టర్స్ బెడ్ రెస్ట్ చెప్పారట . ఇలాంటి మూమెంట్లోనే సాయి పల్లవికి సంబంధించిన మరికొన్ని వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి .
సాయి పల్లవి "తండేల్" హిట్ అవ్వడంతో ఆమెకు బిగ్ బిగ్ ఆఫర్స్ వస్తున్నాయట . అయితే సాయి పల్లవి రెమ్యూన్యూషన్ కూడా పెంచేసిందట . సాయి పల్లవి నిన్నటి వరకు రెండు కోట్లు మూడు కోట్లు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటూ వచ్చిందట . ఇంతవరకు ఆమె ఏ సినిమాకి కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదట. ఇప్పుడు మాత్రం ఒక కోలీవుడ్ డైరెక్టర్ ఆమెను అప్రోచ్ అయ్యి..ఒక కథ వినిపించగా ఆ మూవీ కి మాత్రం సినిమాకి 7 కోట్లు డిమాండ్ చేసిందట . కచ్చితంగా 7 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ చెప్పుకొచ్చిందట . దీంతో ఈ న్యూస్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. సాయి పల్లవి ఇలాంటి హీరోయిన్ నా..? రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. అందరిలానే సాయి పల్లవి అని.. హిట్ పడగానే రూటు మార్చేసే ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టింది అని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి పేరు పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది..!