టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ కంప్లీట్ అయింది. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ హిట్ స్టేటస్ కు ఎన్ని కోట్ల దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 10.45 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.35 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.31 కోట్లు , ఈస్ట్ లో 1.89 కోట్లు , వెస్ట్ లో 1.42 కోట్లు , గుంటూరు లో 1.56 కోట్లు , కృష్ణ లో 1.48 కోట్లు , నెల్లూరు లో 90 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24.36 కోట్ల షేర్ ... 39.46 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి మూడో రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2.68 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ఓవర్సీస్ లో 3.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30.74 కోట్ల షేర్ ... 54.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 7.26 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc