- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


డైరెక్టర్ తేజ ఒకప్పుడు టాలీవుడ్ లో పెద్ద సంచలనం క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు. ఉషాకిరణ్ మూవీస్ బ్యాన‌ర్ పై చెరుకూరి రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో తేజ దర్శకుడుగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఈ సినిమాతో నే హీరో ఉదయ్ కిరణ్ .. హీరోయిన్ రిమాసేన్ తో పాటు చాలామంది కొత్త నటులు వెండితెరకు పరిచయమయ్యారు. చిత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రోజుల్లో 50 లక్షలు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎనిమిది కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత తేజ అదే ఉదయ్ కిరణ్ హీరోగా అనితను హీరోయిన్గా పరిచయం చేస్తూ నువ్వు నేను సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రోజు ల్లోనే ఈ సినిమా చాలా కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.


అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో తేజ అనుకున్న విధంగా హీరోయిన్ అనిత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోవడంతో ఆమెపై చేయి చేసుకున్నారని ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. ఆ తర్వాత హీరో నితిన్ తొలి సినిమా జయం కి కూడా తేజ దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా రెండు ద‌శాబ్దాల క్రితం టాలీవుడ్ లో పెద్ద సెన్షేష‌న్‌. ఆ సినిమాతో సదాను హీరోయిన్గా వెండితెర కు పరిచయం చేశారు. ఆ సినిమా షూటింగ్ టైంలో నూ సదా తాను అనుకున్న విధంగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వకపోవడంతో ఆమెపై కోపం పడటం తో పాటు తేజ చేయి చేసుకున్నారన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా నడిచింది. ఏది ఏమైనా హీరోలు హీరోయిన్లు తాను అనుకున్న విధంగా నటించకపోతే తేజ వాళ్ల‌ పై కోప్పడడం తో పాటు చేయి చేసుకుంటారని ప్రచారం అప్పట్లో బాగా వినిపించేది.

మరింత సమాచారం తెలుసుకోండి: