టాలీవుడ్ క్రేజీ నటుడు అక్కినేని నాగచైతన్య తాజాగా తండెల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

ఇకపోతే విడుదల అయిన మూడవ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మూడవ రోజు ఈ మూవీ మీడియం రేంజ్ హీరోలు నటించిన అన్ని సినిమాల రికార్డులను క్రాస్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య హీరోగా రూపొందిన తాండెల్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మూడవ రోజు 8.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటివరకు ఏ మీడియం రేంజ్ హీరో సినిమా వసూలు చేయని కలెక్షన్లను మూడవ రోజు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత ఉప్పెన మూవీ 8.26 కోట్ల తో రెండవ స్థానంలో , టిల్లు స్క్వేర్ మూవీ 7.44 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో , దసరా సినిమా 6.73 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో ,  విరూపాక్ష మూవీ 5.77 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో , హనుమాన్ సినిమా 5.70 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో , ఖుషి మూవీ 5.68 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో , లవ్ స్టోరీ మూవీ 5.19 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో , బింబిసారా మూవీ 5.02 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో , సరిపోదా శనివారం మూవీ 4.68 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: