యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందులో కావాలనే 11 నెంబర్ ని తీసుకొచ్చి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అది మరింత వివాదంగా మరి చివరకు వైసీపీ అభిమానులు లైలా మూవీని బాయ్ కాట్ చేస్తామనేదాకా వచ్చింది. విడుదల అవ్వకముందే ఈ సినిమాపై నెగిటివిటీ పడిపోయింది. కొన్ని గంటల్లోనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేశారు. దీంతో వెంటనే హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి.. ఆ మాటలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. పృథ్వీ మాట్లాడిన మాటలకు తాను క్షమాపణలు తెలుపుతూ.. తన సినిమాను రాజకీయ గోడవలకు బలి చేయవద్దని తెలిపాడు. ఆయనతో పాటు సినిమా నిర్మాత సాహు గారపాటి కూడా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు.
అయితే విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సారీ చెప్పిన వారు తగ్గలేదు. ఇప్పటికీ బాయ్ కాట్ మూవీ అంటూ హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. ఇప్పటికే 1.15 లక్షల ట్వీట్స్ పడ్డాయి. ఒకవైపు పృథ్వీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు ఆ వ్యాఖ్యలు చేసిన పృథ్వీ వచ్చి క్షమాపణ చెప్పిన కూడా ఇది ఇలాగే కొనసాగుతుందని వైసీపీ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
ఇక తాజాగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బండ్ల గణేష్ కూడా స్పందించాడు. ఆయన సోషల్ మీడియా వేదికగా పృథ్వీకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా  ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో మోడల్‌ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న రోల్స్‌లో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా రామ్‌ నారాయణ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా తొలి పరిచయం ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నటించిన అన్నీ మూవీస్ లో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండేది. మాస్ కా దాస్ పాత్రలలో తెరపై కనిపించే విశ్వక్..  ఇప్పుడు ఈ సినిమాలో లేడి కేటాప్ లో అదరగొట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: