ఈ సినిమాలో సుహాస్ సరసన హీరోయిన్ గా చాందిని చౌదరి నటించారు. సునీల్, వైవా హర్ష, సుబ్బారావు తదితరులు కీలకపాత్రలను పోషించారు. మచిలీపట్నం నేపథ్యంలో ఒక సాధారణ యువకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 2020 అక్టోబర్ 23న ఈ సినిమా ఆహాలో విడుదలై టిఆర్పి రేటింగ్స్ ను క్రాస్ చేసింది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు. కలర్ ఫోటో సినిమా 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ సినిమాగా నిలవడం విశేషం. అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమాను తీయడంతో ప్రతి ఒక్క సినీ అభిమాని కలర్ ఫోటో సినిమాకు ఎంతగానో ఆకర్షితులు అయ్యారు.
కాగా, ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాలో కృష్ణ (సుహాస్) పాలు అమ్ముతూ ఇంజనీరింగ్ చదువుకుంటాడు. బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని తన తండ్రిని సంతోషంగా చూసుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. కాలేజీలో దీప్తి వర్మ(చాందిని చౌదరి) అమ్మవారి వేషంలో చూసిన సుహాస్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. నల్లగా ఉన్న తనని దీప్తి ఇష్టపడదు అని అనుకుంటోడు. కానీ కృష్ణ వ్యక్తిత్వాన్ని దూరం నుంచి చూసిన దీప్తి ప్రేమలో పడుతుంది. ఇక దీప్తి అన్నయ్య సునీల్ ఇన్స్పెక్టర్. అతనికి నలుపు అంటే అసలు ఇష్టం ఉండదు.
తన చెల్లికి ఎలా అయినా మంచి అందగాడిని చూసి వివాహం చేయాలని అనుకుంటాడు. ఆ క్రమంలోనే హీరో కృష్ణపై పగతో వారిద్దరిని వేరు చేస్తాడు. తన చెల్లికి మరో అబ్బాయితో వివాహం చేస్తాడు. సినిమా చివర్లో సుహాస్ మరణించడంతో ఆ విషయం తెలిసి దీప్తి చాలా బాధపడుతుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీని దర్శకుడు చాలా అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాకు అభిమానులు ఎంతగానో ఫిదా అయ్యారు.