టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టైలే వేరు .. ఒకప్పుడు మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు .. ఇటీవల కాలంలో వరుసగా మంచు ఫ్యామిలీ లో జరుగుతున్న గొడవలు .. వివాదాలు మంచు ఫ్యామిలీ బ్రాండ్ .. మంచి ఫ్యామిలీ ఇమేజ్ .. మోహన్ బాబు ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి అని చెప్పాలి. మోహన్ బాబు ఇద్దరూ వార‌సుల‌ మధ్య రకరకాల విష‌యాల పై గొడవలు జరగటం .. మీడియాకు ఎక్కటం .. కేసులు పెట్టుకోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మోహన్ బాబుకు ఒక హీరోయిన్ కు సెట్లోనే పెద్ద గొడవ జరిగింది. ఇది ఇప్పటి విషయం కాదు దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంగతి. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచి విష్ణు హీరోగా తెరకెక్కిన తొలి సినిమా విష్ణు. 2003 అక్టోబ‌ర్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్లాప్ అయ్యింది.


ప్ర‌ముఖ మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా శిల్ప శివానంద్ హీరోయిన్ గా నటించారు శిల్ప అక్క సాక్షి శివానంద్ మోహన్ బాబు సరసన కొన్ని సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే శిల్పను విష్ణు సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఆమె షూటింగుకు ఆలస్యంగా రావడంతో పాటు దర్శకుడు చెప్పినట్టు చేయకుండా ఇబ్బంది పెట్టారన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. చివరికి విష్ణు .. దర్శకుడు చెప్పి చూసిన ఆమె వినిపించుకోలేదని .. చివరికి మోహన్ బాబు కూడా ఒకటి రెండు సార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఆమె వినిపించుకోకపోవడంతో ఆమెపై చేయి చేసుకున్న పుకార్లు అప్పట్లో వినిపించాయి. మోహన్ బాబు కూడా శిల్ప ప్రవర్తన వల్లే విసిగిపోయి వార్నింగ్ ఇచ్చానని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: