- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి బలమైన నేపథ్యం ఉంది. నందమూరి ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు వస్తున్నాయి అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ లెగసీని బలంగా కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకు పోతున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన తాత ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి తనే నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. అయితే కళ్యాణ్రామ్ నిర్మాతగా నిర్మించిన చాలా సినిమాలు వరుస పెట్టి డిజాస్టర్లు అయ్యాయి. పైగా రవితేజ హీరోగా తీసిన కిక్ 2 సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. సురేంద‌ర్ రెడ్డి ని నమ్మి క‌ళ్యాణ్ వ‌దిలేయ‌డంతో మ‌నోడు భారీగా ఖ‌ర్చు పెట్టించేశారు. సినిమా ప్లాప్ కావ‌డంతో నిర్మాత గా ఉన్న‌ కళ్యాణ్రామ్ భారీగా నష్టపోయారు.


ఒకానొక టైములో డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఉండడంతో కళ్యాణ్ రామ్‌ కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. చివ‌ర‌కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ మూతపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అతి త‌క్కువ‌ బడ్జెట్తో తాను రెమ్యూనరేషన్ ఏమాత్రం తీసుకోకుండా జై లవకుశ సినిమాలో ఫ్రీగా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెర‌కెక్కి ప్ర‌తి ఒక్క‌రికి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అలా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తన అప్పులు అన్ని తీర్చేశాడు. అలా ఎన్టీఆర్ మూతపడకుండా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ ఒక్క సినిమా వల్ల కళ్యాణ్ రామ్ ఇప్పుడు నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఎన్టీఆర్ త‌న సోద‌రుడి ని ఇబ్బందుల నుంచి బ‌య‌ట పడేసేందుకు చేసిన ఈ సాయం చాలా గొప్ప‌ద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: