టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియ ర్ను కొనసాగించిన వారిలో రమ్యకృష్ణ ఒకరు. ఈమె తన కెరియర్ లో టాలీవు డ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో అనేక సినిమాలలో నటించి ఎన్నో మూవీలలో మంచి విజయాలను అందుకొని తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించింది.

ఇకపోతే రమ్యకృష్ణ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే రమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సీనియర్ నటి అయినటువంటి రమ్యకృష్ణ నెలకు ఎంత సంపాదిస్తుంది అనే దానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక నెలలో ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కు హైదరాబాదులో మూడు జ్యువెల్లరీ షాప్ లు ఉన్నాయట.

అలాగే కేరళ లో మూడు బ్యూటీ పార్లర్ లు కూడా ఉన్నాయట. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది. దానితో ఈమెకు సినిమాల ద్వారా భారీ మొత్తం లోనే పారితోషకాలు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే జ్యువెల్లరీ షాప్స్ , బ్యూటీ పార్లర్ ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఈమెకు డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది. దానితో ఈమె నెలకు 5 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: