ప్రస్తుతం ఏ సినిమా రిలీజ్ అయిన సరే.. దాన్ని రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసి పెడుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా సినిమాని ఇంట్లోనే ఉంది చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి క్రైమ్ లు చాలా ఎక్కువ అయిపోయాయి. అయితే ఇటీవల టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య, లేడి పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శత్వం వహిస్తున్నారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులకు మనసు దోచుకుంది. ఈ సినిమా శ్రీకాకుళం యాసలో తెరకెక్కింది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.
అయితే ఈ సినిమాని రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసిన విషయం తెలిసిందే. పైరసీపై తాజాగా అల్లు అరవింద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వలన కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ గత రెండు నెలలుగా పైరసీ అనే పిశాచి మళ్లీ మొదలైంది. నెల నుండి అయితే ఇంకా ఎక్కువగా పెరిగింది. ఇటీవల దిల్ రాజు సినిమాను ఇలానే ఆన్ లైన్ లో విడుదల చేశారు. పైరసీని ఆపడానికి నిరంతరం ఫిల్మ్ ఛాంబర్ లు కష్టపడుతున్నాయి. కొందరు వాట్సప్‌ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్‌ చేస్తున్నారు. అలాగే మిగితా సోషల్ మీడియా వాటిలలో కూడా పైరసీ లింక్స్ షేర్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం, జైలుకి పంపిస్తాం జాగ్రత్త' అని వార్నింగ్ ఇచ్చారు. 

 ఇక ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది.  హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: