టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది బ్యూటీలు చాలా ఈజీగా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతారు అని భావించిన వారు మాత్రం ఆ స్థాయికి ఎదకుండానే కెరియర్ గ్రాఫ్ పడిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం.

కృతి శెట్టి : ఈ నటి ఉప్పెన మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది అని చాలా మంది భావించారు. కానీ ఆమె ఉప్పెన తర్వాత నటించిన కొన్ని సినిమాలు మంచి విజయం అందుకున్న ఆ తర్వాత ఆమెకు వరుసగా చాలా అపజయాలు రావడంతో ఈ బ్యూటీ ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. మరి రాబోయే కాలంలో ఈమె మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందేమో చూడాలి.

రీతూ వర్మ : ఈ బ్యూటీ పెళ్లి చూపులు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ కి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కలేదు. దానితో ఈమె ఇప్పటికీ కూడా మీడియం రేంజ్ హీరోయిన్గానే కెరీర్ ను కొనసాగిస్తుంది.

కేతికా శర్మ : ఈ బ్యూటీ రొమాంటిక్ అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి అపజయాలు రావడంతో ఈమె క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: