![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-c1438859-fe2d-4030-9323-ba975cc80bb8-415x250.jpg)
ఈ వారం ఏకంగా 16 కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్ లో విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ, బ్రహ్మ ఆనందం తెరకెక్కించిన బ్రహ్మ ఆనందం సినిమా, ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా, తల సినిమా, అలాగే విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా మూవీ కూడా రిలీజ్ కానున్నాయి.
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 13న మై ఫాల్ట్: లండన్ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ హాక్ డౌన్ సినిమా, నేడు కాదలిక్క నేరమిల్లై, ద విచర్: సైరెన్స్ ఆఫ్ ద డీప్, 12న డెత్ బిఫోర్ ద వెడ్డింగ్, 13న ద ఎక్స్‌చేంజ్ సీజన్ 2, కోబ్రా కై సీజన్ 6, పార్ట్ 3, 14 న ధూమ్ ధామ్, మెలో మూవీ, ఐయామ్ మ్యారీడ్.. బట్ సినిమా రిలీజ్ అవ్వనున్నాయి. హాట్ స్టార్ లో నేడు బాబీ ఔర్ రిషికి లవ్‌స్టోరీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. జీ5 ఓటీటీలో ప్రేమికుల రోజున ప్యార్ టెస్టింగ్ రిలీజ్ అవ్వనుంది. ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 సినిమా ఫిబ్రవరి 14 న స్ట్రీమింగ్ అవ్వనుంది. సోనీ లీవ్ లో మార్కో సినిమా, లయన్స్ గేట్ ప్లే లో సబ్‌సర్వియన్స్ ఫిబ్రవరి 14న విడుదల అవ్వనుంది. హోయ్‌చోయ్‌లో బిషోహోరి సినిమా ఈ నెల 13 న రిలీజ్ కానుంది.