![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/tollywood-star-hero-ntr-latest-updates36527a59-565f-4c28-b358-062a9e106e42-415x250.jpg)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఎందరో హీరోయిన్లతో నటించారు. ఎన్టీఆర్ తొలి సినిమా నిన్ను చూడాలని నుంచి తాజాగా వచ్చిన దేవర వరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి ఎన్నో హిట్ సినిమాలలో నటించారు. అలాగే కొందరు హీరోయిన్లను ఎన్టీఆర్ రిపీట్ కూడా చేశారు. సమంత - కాజల్ లాంటి హీరోయిన్లతో ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలు చేశారు. ఏ హీరోయిన్ విషయంలోను ఎన్టీఆర్ పై ఎలాంటి పుకార్లు రాలేదు. అయితే ఒక హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ పై పుకార్లు వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? బాలీవుడ్ ముద్దుగుమ్మ సమీరారెడ్డి. సమీరా రెడ్డి వాస్తవానికి తెలుగమ్మాయి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం లో ఉన్న ఐతెంపూడి. సమీరారెడ్డి తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. అలా ముంబైలో పుట్టిన సమీరా అక్కడే మోడలింగ్లో రాణించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సరసన ముందు గా నరసింహుడు సినిమా లో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్ సినిమాలో ను ఆమె హీరోయిన్గా నటించింది. అయితే ఎన్టీఆర్ కావాలని రికమెండ్ చేసి మరి అశోక్ సినిమాలో సమీరాను హీరోయిన్గా పెట్టించారన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి. సమీరా రెడ్డికి హైదరాబాదులో ఒక ప్లాట్ కూడా కొనిపెట్టారు అన్న ప్రచారం జరిగింది. ఆమె ను ఇష్టపడడం వల్లే ఆమెకు ప్లాట్ తో పాటు కారు కొనిపించారన్న టాక్ నడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో కాని ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. మరోసారి వీరిద్దరు కలిసి సినిమా చేయలేదు.