టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి , అనిల్ రావిపూడి , సాహు గారపాటి ముగ్గురు కూడా చెప్పుకొచ్చారు. చిరంజీవి తాజాగా ఓ సినిమా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... నా తదుపరి మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాను.

ఆ సినిమాని సాహూ గారపాటి నిర్మించబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాకు వినిపించగా అవి అద్భుతంగా అనిపించాయి. ఎప్పుడేప్పుడు ఆ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేద్దామా అని నేను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. అలాగే ఈ సంవత్సరం సమ్మర్ నుండి ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు కూడా చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.

ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇకపోతే చిరు , అనిల్ కాంబో మూవీ కి ఎవరు సంగీతం అందిస్తారా అనే ప్రశ్న జనాల్లో నలుగుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అద్భుతమైన సంగీతం అందించి ఆ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించిన భీమ్స్ సిసిరోలియో నే అనిల్ రావిపూడి , చిరంజీవి సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: