![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/boycott-laila5984e046-cd4c-46eb-ace9-1de7334fad58-415x250.jpg)
ఈ వేడుకకు మెగా హీరో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం. అయితే ఈవెంట్ లో ప్రతి ఒక్కరూ మాట్లాడారు. అందులో భాగంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. పృధ్విరాజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారాయి. తాను చేసిన వ్యాఖ్యలకు బైకాట్ లైలా అనే నినాదాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుత జనసేన నేత, మాజీ వైసీపీ నేత పృథ్వి రాజ్ తన మాజీ పార్టీ వైసిపిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఎలాంటి సందర్భం లేకపోయినా వైసిపిని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు పేల్చారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తు చేస్తూ పరోక్షంగా ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చాడు. అవి కాస్త విపరీతంగా వైరల్ గా మారడంతో వైసిపి నేతలు పృధ్విరాజ్ క్షమాపణలు చెబితేనే ఏపీలో సినిమాను ఆడనిస్తామని అంటున్నారు. దీంతో భయానికి గురైన పృథ్వీరాజ్ దుబాయ్ కి వెళ్ళిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కాగా, లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ లోపు పృథ్వీరాజ్ కనక క్షమాపణలు చెప్పితేనే ఈ గొడవ కాస్త సద్దుమణిగేలా ఉంది. తాజాగా ఈ విషయంపై నిన్న హీరో విశ్వక్సేన్ స్పందించారు. అసలు పృధ్విరాజ్ మాట్లాడుతున్న సమయంలో తాను అక్కడ లేనని విశ్వక్సేన అన్నారు. పృధ్విరాజ్ మాట్లాడిన మాటలకు హీరో విశ్వక్సేన్ క్షమాపణలు చెప్పాడు.