టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే రామ్ పోతినేని కొన్ని సంవత్సరాల క్రితం సుకుమార్ దర్శకత్వంలో జగడం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

అప్పటికే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ ఈ సినిమాలో హీరోగా నటించడం ... ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలోని రామ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాలో రామ్ కి జోడిగా ఇషా సహానీ నటించింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. దానితో ఈమెకు జగడం సినిమా తర్వాత వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈమెకు జగడం సినిమా తర్వాత ఈ నటికి తెలుగు లో అవకాశాలు ఏమీ రాలేదు. దానితో ఈమె జగడం మూవీ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు. ఇకపోతే జగడం సినిమా వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: