టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవిసినిమా విడుదల కాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా చిరంజీవి , అనిల్ రావిపూడి మరియు ఈ సినిమాను నిర్మించబోయే సాహు గారపాటి ఈ మూవీ కి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికే చెప్పుకొచ్చారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు కూడా వీరు అధికారికంగా తెలియజేశారు.

ఇకపోతే ఈ మూవీ యొక్క షూటింగ్ను ఈ సంవత్సరం సమ్మర్ నుండి మొదలు పెట్టనున్నట్లు తాజాగా చిరంజీవి కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను అనిల్ రావిపూడి స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాగానే ఈ మూవీ యొక్క షూటింగ్ను మొదలు పెట్టే ఆలోచనలు అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క షూటింగ్లో ఫుల్ స్పీడులో కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి పండక్కు విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా తనకు ఎంతో కలిసి వచ్చిన సంక్రాంతి విడుదల సెంటిమెంట్ను చిరంజీవి సినిమా విషయంలో కూడా అనిల్ రావిపూడి ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: