మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది.

ఇకపోతే చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... జగపతిబాబు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ ని ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం మార్చి 27 వ తేదీన చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: