![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nagarjuna5298e3e6-ba71-46cb-8b7e-26944d716b6f-415x250.jpg)
నాగచైతన్య రీసెంట్ గానే "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . తన రెండో భార్యగా శోభిత ధూళిపాళ్ల రావడమే అందుకు కారణం అంటూ నాగచైతన్యకి ఇలా కలిసి వచ్చింది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు జనాలు. అయితే ఇప్పుడు నాగార్జున రెండో పెళ్లి మ్యాటర్ ని కూడా బయటకు తీస్తున్నారు . లక్ష్మీ ని ఇష్టంగా పెళ్లి చేసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి అనే విషయం చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే లక్ష్మీ తర్వాత అమల కంటే ముందే ఓ హీరోయిన్ తో ఆయన టూక్లోజ్ గా ఉన్నాడు అని .. ఆ హీరోయిన్ ని ప్రేమించాడు అని ..పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు అని .. కానీ నాగేశ్వరరావు అందుకు ఒప్పుకోలేదు అన్న వార్తలు కూడా గుర్తు చేసుకుంటున్నారు .
ఆ హీరోయిన్ మరెవరో కాదు "రమ్యకృష్ణ". నాగార్జున - రమ్యకృష్ణ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ డూపర్ హిట్ . టబు - నాగార్జున తర్వాత అంత హిట్ పెయిర్ గా పాపులారిటీ సంపాదించుకుంది నాగార్జున -రమ్యకృష్ణ అనే చెప్పాలి . వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్ళు కూడా ప్రేమించుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే అదంతా అబద్ధం అంటూ కొంతమంది కొట్టీ పడేశారు. మరి కొంతమంది మాత్రం నాగార్జున కి ఆ టాలెంట్ కూడా ఉంది . లవ్ చేసే ఉంటాడు అని మాట్లాడుకున్నారు . అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ మరొకసారి సోషల్ మీడియాలో మాత్రం బాగా చర్చించుకుంటూ నాగార్జున రెండు పెళ్లిల మేటర్ ని హైలెట్ చేస్తున్నారు..!