బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం'. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సెట్స్ నుంచి సాయి పల్లవి, రణ్ బీర్ కు సంబంధించిన  కొన్ని ఫొటోలు కూడా లీకయ్యాయి. కానీ మేకర్స్ నుంచి  మాత్రం అధికారిక ప్రకటన లేకపోవడంతో ప్రేక్షకులు సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా రామాయణం' రెండు పార్టులుగా రానున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మూవీ విడుదల తేదీలను ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ విడుదల కానున్నట్లు  పోస్టర్ రిలీజ్ చేశారు.   ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. కేజీఎఫ్  స్టార్ యష్ రావణుడిగా, కైకేయి పాత్రలో  లారా దత్త, శూర్పణకాగా రకుల్ ప్రీత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చేతులు కలిపారు. ఇదిలావుండగా రణబీర్ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ వార్ షెడ్యూల్ లో బిజీగా ఉండటంతో, అతడు నితీష్ జీ రామాయణం కోసం కాల్షీట్లు కేటాయించలేకపోయాడు. దీంతో అతడు లేకుండానే డూప్ ని ఉపయోగించి కొన్ని సన్నివేశాలను నితీష్ తెరకెక్కిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక భారీ వీఎఫ్ ఎక్స్ తో రూపొందించనున్న రామాయణం చిత్రం ప్రతిష్ఠాత్మక చిత్రం. దీని పోస్ట్ ప్రొడక్షన్ కోసం నితీష్ తివారీ చాలా ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొదటి భాగం పని మాత్రమే పూర్తవుతుంది. రెండవ భాగం పూర్తి కావాల్సి ఉంది. జూన్ నాటికి రణబీర్ రామాయణం షెడ్యూల్ లోకి జాయిన్ అవుతారని తెలిసింది.రామాయణంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ భక్తిరస చిత్రంలో నటించాల్సి ఉంటుంది. తన పాత్రపై అంతగా ఆసక్తి లేదు.అన్నట్టుగా దూరం దూరంగా ఉండిపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అలాగే ఇందులో అరుణ్ గోవిల్ రాజా దశరథుడిగా.. లారా దత్తా కైకేయిగా.. సాక్షి తన్వర్ మండోదరిగా.. నవీన్ పొలిశెట్టి లక్ష్మణుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. అత్యాధునిక విజువల్ ఎఫెక్టులతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని.. ఇందులో అయోధ్య వైభవం.. యుద్ధాలు.. ఆధ్యాత్మిక అంశాలను వెండితెరపై చూపించనున్నారు. అలాగే ఈ మూవీ కోసం 11 కోట్లతో అయోధ్యను రీక్రియేట్ చేయనున్నారు. ప్యాలెస్ నుంచి వీధుల వరకు నగరం మొత్తం మీద మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: