పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనే మాటని మనం అనేక సార్లు వినే ఉంటాము. ఇకపోతే ప్రేమ వివాహాలు చేసుకునేవారు పెళ్లికి ముందే కొంత కాలం పాటు ఒకరితో ఒకరు మాట్లాడి , ఒకరి గురించి ఒకరు అనేక విషయాలు తెలుసుకొని వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా జీవితాన్ని కొనసాగిస్తామని నమ్మకం ఏర్పడినట్లయితే కొంత మంది పెళ్లి చేసుకొని జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇక పెద్దలు కుదిర్చిన వివాహాలలో మాత్రం ఒకరిని ఒకరు అంతకు ముందు ఎప్పుడూ చూసుకొని సందర్భాలు కూడా చాలానే ఉంటాయి.

పెద్దలు కుదిర్చిన పెళ్లిలలో ఒకరిని ఒకరు చూసుకోకపోయినా ఎంతో అన్యోన్యంగా జీవితాలను గడిపిన ఎన్నో జంటలు సమాజంలో అనేకం ఉన్నాయి. ఇక దానికి ప్రధాన కారణం ఒకరికి ఒకరికి మధ్య ఏజ్ గా ఉండడం వల్ల ఒకరిని ఒకరు ఎంతో బాగా అర్థం చేసుకోవడం వల్ల పెద్దలు కుదిర్చిన వివాహాలు అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి అని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. ఇకపోతే అలా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న ఓ జంట తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉంది. ప్రస్తుతం వారు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ 27 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ , లక్ష్మి ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

వివాహం సమయంలో లక్ష్మి ప్రణతి వయస్సు కేవలం 18 సంవత్సరాలు. ఇక ప్రణతి , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మధ్య 9 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిళ్లలో ఈ పెళ్లి ఒకటి. దాదాపు ఈ పెళ్లిని 100 కోట్ల ఖర్చుతో చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: