- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అక్కినేని నాగ చైతన్య - సమంతప్రేమ .. పెల్లి ..ఆ త‌ర్వాత విడాకులు అనేవి టాలీవుడ్‌లో మాత్ర‌మే కాదు.. తెలుగు మీడియాలోనూ .. తెలుగు సోష‌ల్ మీడియా లోనూ ఎంత సంచ‌ల‌నం అయ్యాయో అంద‌రికి తెలిసిందే. వీరిద్ద‌రి కి తొలి సినిమామాయ చేశావే. ఆ సినిమా లో ఇద్ద‌రి రోమాన్స్ .. కెమిస్ట్రీ నిజంగానే కేక పెట్టించేసింది. త‌మ తొలి సినిమా లో క‌లిసి న‌టించిన ఈ ఇద్ద‌రు ఆ సినిమాతో ప్రేమలో పడి ... ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. అస‌లు వీరు ప్రేమ‌లో ఉన్న‌ట్టు చాలా రోజులు కాదు.. చాలా యేళ్ల వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి నాలుగు సినిమా ల‌లో జంట‌గా న‌టించారు. చివ‌ర‌కు అక్కినేని ఫ్యామిలీ సినిమా మ‌నం లో కూడా న‌టించారు. పెళ్లి త‌ర్వాత మ‌జిలీ సినిమా చేస్తే అది కూడా పెద్ద హిట్ అయ్యింది.


అయితే వీరిద్ద‌రి విడాకుల‌కు చాలా కార‌ణాలే ఉండి ఉండొచ్చు కాక‌.. ఓ డిజాస్ట‌ర్ సినిమా కూడా ఈ జంట విడిపోవ‌డానికి కార‌ణం అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ లో ఉన్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. జాను సినిమా. త‌మిళం లో త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా 96 . ఈ సినిమాను తెలుగు లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఇక్కడ తిరిగి రీమేక్ చేశాడు. ఈ సినిమా ఫేడవుట్ అయిన హీరోయిన్‌ త్రిష కి మంచి కం బ్యాక్ సినిమా గా నిలిచింది. ఈ సినిమా ను ముందుగా దిల్ రాజు నాగ చైతన్య - సమంత కాంబినేష‌న్ లో తీయాలనుకున్నారు. అయితే చైతూకి కథ ఎంత మాత్రం నచ్చలేదు.


అయితే స‌మంత మాత్రం ఈ సినిమా ఎలాగైనా చేయాల‌ని పంతం తో ఉంది. నాగ చైతన్య ఎంత చెప్పినా వినలేదట. వారి మధ్య మనస్పర్థలు మొదలవడానికి ఈ సినిమా కూడా ఓ కారణం అన్న టాక్ ఉంది. చివ‌ర‌కు హీరో గా చైతు ప్లేస్ లోకి శ‌ర్వానంద్ వ‌చ్చి చేరాడు. షూటింగ్ పూర్త‌య్యి మొత్తం అవుట్ పుట్ చూసుకున్న తర్వాత సమంత హీరోయిన్ గా ఉన్నా కూడా దిల్ రాజు కు అర్థ‌మై ప్రమోష‌న్లు చేయ‌లేదు. చివ‌ర‌కు సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అలా చివ‌ర‌కు చైతు నిర్ణ‌యం క‌రెక్ట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: