సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాలి అంటే టాలెంట్ ఎంత ఉన్నా లేకపోయినా అందం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. టాలెంట్ లేని హీరోయిన్స్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాజ్యమేలుస్తున్నారు . అలాంటి హీరోయిన్స్  టాప్ స్థానంలో చేరి పాన్ ఇండియా బ్యూటీలుగా కూడా చలామని చేస్తున్నారు . కానీ అందంగా లేకపోయినా టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఎక్కడో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు . అది అందరికీ తెలిసిందే. అంత ఇంపార్టెంట్ .


గ్లామరస్ ఫీల్డ్ లో గ్లామర్ గా కనిపించకపోతే అస్సలు పట్టించుకోరు . అయితే అందం కోసం చాలా మంది హీరోయిన్స్ కడుపుకి అన్నం తినడం కూడా మానేస్తారు.  ఇష్టమైన భోజనం ని పక్కన పెట్టేస్తారు . రకరకాల డైటింగ్ లతో బాడీని కత్తిలా  మల్లెతీగలా నాజుకుగా ఉంచుకోవడానికి నానావిధాలుగా ట్రై చేస్తూ ఉంటారు.  అయితే చాలామంది రకరకాల వర్కౌట్ చేసి రకరకాల డైటింగ్ చేసి ఇంత స్లిమ్ గా బాడీని ఉంచుకుంటారు అని అనుకుంటూ ఉంటారు . అయితే కొంతమంది మాత్రం ఇలా చేసి బాడీ పర్ఫెక్ట్ గా ఉంచుకుంటారు.




మరి కొంతమంది మాత్రం బాగా ఇష్టమైనది తింటూ పొట్ట వచ్చిన సరే ఆ పొట్ట కనిపించకుండా రకరకాల టెక్నాలజీస్ తో దాని కవర్ చేస్తూ ఉంటారు.  మరి కొందరు ఏకంగా "టమ్మి టక్కర్"  లాంటివి యూస్ చేస్తూ ధైస్  దగ్గర ఫ్యాట్ ని.. టమ్మీ దగ్గర ఫ్యాట్ ను కనపడకుండా మాయ చేస్తూ ఉంటారు . చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ ఇదే ట్రై చేస్తూ ఉంటారు.  కడుపునిండా ఇష్టమైన ఫుడ్  తినేసి పొట్ట పెరిగితే అది కనపడకుండా టమ్మి టక్కర్ యూస్ చేస్తూ ఉంటారు.  చాలామంది హీరోయిన్స్ ఇదే విధంగా చేస్తూ ఉంటారు అంటూ రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది . సెక్సీగా కనిపించడానికి ఇలా కూడా చేస్తారా అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: