![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-rajababu-b3e0cdb8-3b17-4971-9e78-14eb54c0b0fa-415x250.jpg)
తెలుగు సినిమా పరిశ్రమ లో అద్భుతమైన నటుల పేర్లు చెప్పాల్సి వస్తే అందులో రాజబాబు పేరు తప్పకుండా ఉంటుంది. హాస్య నట చక్రవర్తిగా ఎన్నో వెలకట్టలేని పాత్రలు పోషించారు. రాజబాబు హీరో ఎవరైనా సరే రాజబాబు ఉంటే చాలు సినిమా సగం హిట్ అయినట్టే అన్నది ఆనాటి దర్శక .. నిర్మాతల నమ్మకం. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన రాజబాబు ఒకానొక దశలో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే వారట. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 35 వేల రూపాయలు రాజబాబు రెమ్యునరేషన్ 20 వేల రూపాయలు అని నిర్మాత అనుకున్నారు. తనకు 35 వేల రూపాయలు కావాల్సిందే అని రాజబాబు పట్టు పట్టారు. ఎన్టీఆర్ హీరో ... మీరు కమెడియన్ అని నిర్మాత అంటే అయితే హీరోనే కమెడియన్ గా చూపించి సినిమా విడుదల చేయండి అని ఆన్సర్ ఇచ్చారట. రాజబాబు జగపతి వారి అంతస్తులు సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషకం 1300 రూపాయలు రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం.
అదే ఆ తర్వాత హీరోలతో సమానంగా రెమ్యూనికేషన్ తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐదు రూపాయల కోసం చెన్నై టీ నగర్ లో గంటల తరబడి నిలబడిన చోటు లక్ష రూపాయల ఖరీదైన కారు లో వెళుతూ గతాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకునే వారట. రాజబాబు ఒక గంట ఎన్టీఆర్ తో నడిస్తే మరో గంట శోభన్ బాబు అలా ఒకేసారి ఒకేరోజు ఇద్దరు ముగ్గురు హీరోల సినిమా ల్లో నటించిన రికార్డు రాజబాబు సొంతం. ఆయనకు డబ్బుతో పాటు పరపతికి కొదవలేదు .. ఇక రాజబాబు అసలు పేరు ఏమిటో తెలుసా పుణ్యమూర్తుల అప్పలరాజు ఆయన సినిమాల్లోకి వచ్చి రాజబాబుగా స్థిరపడిపోయారు.