![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-777a3471-5ceb-46c1-b453-e87e2909d9c9-415x250.jpg)
అయితే ప్రస్తుత కాలంలో స్టాండప్ కామెడీ, ఇన్ ఫ్లూయెన్సర్స్, పాడ్ కాస్ట్ అనే పేర్లతో చాలామంది యాంకర్ లు, ఇన్ ఫ్లూయెన్సర్స్ ఓ షోలో చెత్త వాగుడు వాగడం. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. దానిపై చాలా వ్యతిరేకత వచ్చింది. అలాగే కేసు కూడా నమోదు అయింది. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ,యూట్యూబర్ రన్వీర్ అలహాబాదియా పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆమె మాట్లాడుతూ.. మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.. మంచిగా పెంచుకోవాలి. వారి మంచి మార్గంలో పెంచాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఇడియట్స్ కి దూరంగా ఉండాలి. వారిని అన్ ఫాలో చేయండి. యంగ్ జనరేషన్ కోసం మనం ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తోంది' అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఇది విన్న వారందరూ. ఇందులో రన్వీర్ అలహాబాదియా తప్పు ఉంది.. అలాగే అతనితో పాటుగా అపూర్వ, సమయ్ రైనాది కూడా తప్పు ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ముగ్గురిని విడిచిపెట్టకొడదు, ముగ్గురికి శిక్ష పడాలి అంటూ నెటిజన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. ఇక నటి రేణూదేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.