![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ask82anncut-415x250.jpg)
అలా వరుస పెట్టి సినిమాలలో నటించి ఆగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. ఇక ఏమైందో తెలియదు కొన్ని రోజులపాటు తాను సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. అనంతరం మళ్లీ సీరియల్స్, వెబ్ సిరీస్, సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది ఇలా నాలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది.
వరుసగా సీరియల్స్ చేసుకుంటూ బిజీగా గడుపుతోంది. అయితే కస్తూరి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. వాటి నుంచి తాజాగా బయటపడిన కస్తూరి రీసెంట్ గా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రతిరోజు అర్ధరాత్రి 9 దాటిన తర్వాత తనకు మందు తాగే అలవాటు ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.
మందు లేకపోతే తనకు రాత్రి అసలు నిద్ర పట్టదట. రాత్రి 9 దాటిన అనంతరం మందు తాగి పడుకుంటుందట. తెల్లారితే తల పట్టుకుందని తల నొప్పి తో బాధపడుతుందట. ఈ విషయాన్ని కస్తూరి స్వయంగా వెల్లడించింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం నటి కస్తూరి సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది.