![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/anil-ravipudi-chiranjeevi-movie-updae863b8d74-6085-4fef-bd59-2919daf824da-415x250.jpg)
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పనులు కూడా మొదలయ్యాయని ఈనెల 17 లేదా 18వ తేదీలో వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కూడా పూర్తిగా వినోదాత్మకంగా సాగే సినిమా. చాలా కాలం తర్వాత ఇలాంటి కథతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఈ సినిమా సమ్మర్లో సెట్స్ మీదికి తీసుకువెళ్లి.. ఈ ఏడాది లోపల లేకపోతే వచ్చే ఏడాది మొదట్లోనైనా ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా విడుదలకు ముందు నుంచే సక్సెస్ డైరెక్టర్గా పేరుపొందిన అనిల్ రావిపూడి విభిన్నమైన ప్రమోషన్స్ తో సినిమాలను ఆకట్టుకుంటూ ఉంటారు.మరి ప్రస్తుతం అయితే అనిల్ రావిపూడి దృష్టి అంతా కూడా చిరంజీవి చిత్రంపైనే పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిరంజీవి కూడా విశ్వంభర సినిమాని చక్క చక్క పూర్తి చేసి శ్రీకాంత్ ఓదెలతో అటు డైరెక్టర్ అనిల్ రావు పూడితో ఒకేసారి సినిమాని మొదలు పెడతారేమో చూడాలి. విశ్వంభర సినిమా పెద్దగా ఆకట్టుకునేలా ఉండదని గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమాకి మైనస్ గా మారింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.