మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప.ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాకు ముకేశ్ కుమార్ దర్శకత్వం వహించాడు.ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుంది. ఈక్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి శివ శివ శంకర అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా పాటలో ప్రతి చరణం, లైన్ ఎంతో హృద్యంగా శివ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగేలా చేశారు. కేరళకు చెందిన మ్యూజిక్ సెన్షేషన్ స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించగా విజయ్ ప్రకాష్ ఆలపించారు. పాట విడుదలైన గంటల్లోనే మిలియన్లలో వ్యూస్ సాధించి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రేక్షకుల నుంచి కూడా ఫస్ట్ టైం పాజిటివ్ కామెంట్లు భారీగా వస్తున్నాయి.ఇదిలావుండగా సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఒక్కరోజులో మారిపోవచ్చు. ట్రోల్స్, నెగటివ్ ప్రచారం ఎంతగా ఉన్నా, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుల ప్రేమను పొందడం ఖాయం.అలాంటి ఉదాహరణగానే మారింది మంచు విష్ణు కన్నప్ప. మొదటి నుంచీ ఈ సినిమా గురించి భిన్నమైన కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

ముఖ్యంగా కొన్ని పోస్టర్స్ విడుదలయ్యాక ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. కానీ ఇప్పుడు ఒక్క పాటతోనే అంచనాలు మారిపోయాయి. మంచు పవర్ఫుల్ కంటెంట్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.కన్నప్ప నుంచి వచ్చిన మొదటి పాట శివ శివ శంకర ఆడియన్స్‌ని ఆశ్చర్యపరచింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ చేతుల మీదుగా విడుదలైన ఈ పాట ఇప్పటి వరకు వచ్చిన ట్రోలింగ్‌కు సరైన సమాధానం ఇచ్చింది. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాష్ తన గొంతుతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రభుదేవా కొరియోగ్రఫీ, స్టీఫెన్ దేవస్సీ సంగీతం కలిసొచ్చి, ఈ పాటను ఓ పవర్‌ఫుల్ భక్తి గీతంగా మార్చాయి.ఇక ప్రభాస్ సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో కూడా హైప్ పెరుగుతోంది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కన్నప్ప ఈ పాట ద్వారా మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. మరి సినిమా రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: