- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమా కావటం విశేషం. ఇక మహేష్ బాబు గత యేడాది సంక్రాంతి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో రాజకుమారుడు తొలి సినిమా అయినా ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏది అని చెప్పాల్సి వస్తే .. 2003 సంక్రాంతి కానుక వచ్చిన ఒక్కడు సినిమా అని చెప్పాలి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా భూమిక హీరోయిన్గా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. మణిశ‌ర్మ‌ అందించిన స్వరాలు .. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ ... మార్తాండ కే వెంకటేష్ ఎడిటింగ్ ... నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మాణ విలువలు చార్మినార్ సెట్ ఇవన్నీ సినిమాను నిలబెట్టాయి.


అయితే ఒక్క‌డు సినిమా ఆ రోజుల్లోనే 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా కు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ముందుగా అత‌డే ఆమె సైన్యం అన్న టైటిల్ పెట్టాల‌ని అనుకున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ భూమిక ను హీరో ర‌క్షిస్తాడు. క‌థ అంతా ఆమె చుట్టూ న‌డుస్తుంది. అందుకే అత‌డే ఆమె సైన్యం అనుకున్నారు. ఆ త‌ర్వాత క‌బ‌డ్డీ అనే టైటిల్ కూడా అనుకున్నారు. చివ‌ర‌కు ఒక్క‌డు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా మ‌హేష్ బాబు కెరీర్ వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా చేసింది. ఆ త‌ర్వాత ఒక్క‌డు సినిమా ఇచ్చాడ‌న్న న‌మ్మ‌కం తోనే గుణ‌శేఖ‌ర్ కు అర్జున్ సినిమా తో పాటు సైనికుడు లాంటి మ‌రో అవ‌కాశాలు ఇచ్చాడు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: