స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు. తాను దర్శకత్వం వహించే సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్నాడు. ఈ విషయం పైన తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి అక్కడ మాట్లాడుతూ తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడితో చేయబోతున్నట్లుగా చెప్పారు.


ఈ సినిమాకు కొనిదెలా సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వెల్లడించాడు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలను అతి త్వరలోనే ప్రేక్షకులందరికీ తెలియజేస్తామని అన్నారు. కోదండరామిరెడ్డితో ఉన్న కెమిస్ట్రీ దర్శకుడు అనిల్ రాయపూడితో సెట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానని మెగాస్టార్ చెప్పడం జరిగింది.


కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఫిక్స్ చేశారట. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే నయనతార భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయం తెలిసిందే. మరి మెగాస్టార్ చిరంజీవి సరసన సినిమాలో నటించడానికి నయనతార ఎంత మేరకు రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందనే సందేహంలో చిత్ర బృందం ఉన్నారట. ఈ విషయం పైన అధికారిక సమాచారం మరి తొందరలోనే వెలువడనుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోయే సినిమాపై తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


వీరిద్దరి కాంబినేషన్లో చేసే సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని రాఘవేంద్రరావు సూచనలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విక్టరీ వేడుకలలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. సంక్రాంతి అనే పదాన్ని వదిలిపెట్టకూడదని రాఘవేంద్రరావు అన్నారు. ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని అనిల్ రావిపూడికి చెప్పాడు. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: