హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నో సినిమాలలో ఈ బ్యూటీ నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహరెడ్డి సినిమాతో హనీ రోజ్ విపరీతంగా క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో బాలయ్య బాబుకు మరదలు పాత్రలో నటించింది. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ పోషించారు. కాగా, ఈ సినిమాలో హనీ రోజ్ నటనకు, అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షితులయ్యారు.


సినిమా అనంతరం ఎక్కడ చూసినా హనీ రోజ్ పేరే వినిపించింది. వరుసగా ఈ బ్యూటీ సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. కేవలం సినిమాలోనే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలోనూ యాక్టివ్ గా పాల్గొంది. కాగా, ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి మళ్లీ సినిమాలలో అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

దీంతో ఈ చిన్నది తన గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హాట్ గా ఫోటోలను పంచుకుం టుంది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఎంతగానో ఫిదా అవుతున్నారు. తన అందాలను చూపకనే చూపిస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. కాగా, ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వార్త విపరీతంగా వైరల్ గా మారింది.

హనీ రోజ్ వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ కొంతమంది హీరోలతో ఎఫైర్లు కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 70 ఏళ్ల హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: