![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-040b64a9-d9fe-4b9f-b873-526c92c8f3d6-415x250.jpg)
ఈమెని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్నేహ వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఈమె అటు సినిమాలు చేస్తూనే.. ఇటు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉంటుంది. హీరోయిన్ స్నేహ తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం భాషలలో కూడా సినిమాలు తీసింది. తెలుగు ప్రేక్షకులకు ఈమె అంటే చాలా ఇష్టం. స్నేహ, హీరో గోపీచంద్ నటించిన తొలివలపు సినిమాలో హీరోయిన్ గా నటించి.. మొదటిసారి తెలుగు తెరపైన కనిపించింది. ఆ తర్వాత ఈమె తరుణ్ సరసన ప్రియమైన నీకు, రవితేజతో వెంకీ, విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతి, శ్రీకాంత్ తో రాధాగోపాలం, కింగ్ నాగార్జునతో శ్రీరామదాసు వంటి టాప్ హీరోలతో నటించి మంచి హిట్ లను అందుకుంది.
ఆ తర్వాత తమిళ హీరో ప్రసన్నను వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యాక చాలా కాలానికి ఈమె హీరో, హీరోయిన్ లకు అక్క, వదిన రోల్ లలో కనిపిస్తుంది. అయితే తాజాగా ఈమె చీర కట్టుకొని దిగిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి.