
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారిని నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ సాయి పల్లవి ఒకరు. ఈ బ్యూటీ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాను నటించిన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు చేరువైంది. పక్కింటి అమ్మాయిల అనిపించే సాయి పల్లవి తనదైన నటన అందంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరిస్తూ సినిమాలలో సాయి పల్లవి నటించడం విశేషం. సాయి పల్లవి వరుస సినిమా హిట్ సినిమాలతో ఆగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. కాగా, సాయి పల్లవి ఓ రొమాంటిక్ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహించబోయే సినిమాలో సాయి పల్లవి నటించబోతుందట.
ఇందులో తమిళ స్టార్ హీరో శింబు హీరోగా నటించనున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఎస్ టి ఆర్ 49 అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. ఇందుకోసం షూటింగ్ ను వేగంగా జరుపుతున్నారు. కాగా, హీరో శింబు సినిమాలంటే రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లు, రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది.
మరి అలాంటి సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.... తండేల్ సినిమాతో సాయి పల్లవి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా అత్యంత వేగంగా భారీగా కలెక్షన్లను రాబట్టుతుండడం విశేషం. వాలెంటైన్ వీక్ కావడంతో ఈ సినిమాను చూడడానికి ప్రేమికులు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంది.