![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sai-pallavi-9644141d-df9b-4dfd-94d4-5ab797e7a3b4-415x250.jpg)
అంతా బాగానే ఉంది. సాయి పల్లవి బాగా నటిస్తుంది . బాగా డాన్స్ చేస్తుంది. బాగా మాట్లాడుతుంది. బాగా మింగిల్ అవుతుంది . అయితే ఎక్స్పోజింగ్ చేయదు . రొమాంటిక్ సన్నివేశాలలో నటించదు. ఈ విషయం కూడా ఓకే . అయితే సాయి పల్లవి రీసెంట్ గా "తండేల్" సినిమా హిట్ అయిన మూమెంట్లో ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బాయ్ అనే ట్యాగ్ సంపాదించుకున్న శింబుతో ఆమె ఒక సినిమాకి కమిట్ అయిందట .
శింబు ఎంత రొమాంటిక్ ప్లే బాయ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరికీ తెలిసిందే. అయితే అలాంటి శింబుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా..? అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఖచ్చితంగా సాయి పల్లవి కెరియర్ కి ఇదొక నెగిటివ్ మార్క్ గా మిగిలిపోతుంది అంటున్నారు . దీనితో సాయి పల్లవి కెరియర్ ఢమాల్ అంటూ పడిపోతుంది అని కూడా మరికొందరు హెచ్చరిస్తున్నారు . అయితే సాయి పల్లవి మాత్రం ఈ వార్తలపై ఎటువంటి విధంగా నెగిటివ్గా స్పందించకపోవడంతో ఇది నిజమేనా ..?సాయి పల్లవి ఇష్టంగానే శింబుతో నటిస్తుందా..? సాయి పల్లవి కూడా మరొక నయనతార - హన్సిక ల మారబోతుందా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై సాయి పల్లవి ఎంత త్వరగా స్పందిస్తే అంత బాగుంటుంది అంటున్నారు జనాలు..!