నాగచైతన్య తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య ఎన్నో సినిమాలలో నటించిన ఒక హిట్టు కూడా అందుకోలేక పోయారు. అయితే తిరిగి ఈయన మరోసారి సాయి పల్లవితో కలిసి తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగచైతన్యతో పాటు అక్కినేని అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా చూసి వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.ఇదిలావుండగా తండేల్ ' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.ఈ సందర్భంగా మేకర్స్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 11న జరగబోయే ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్టుగా రాబోతున్నట్లు ప్రకటించారు. 'లవ్ సునామీ సెలెబ్రేషన్స్ విత్ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున' అంటూ పోస్టర్ షేర్ చేశారు.కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ ను నిర్మించారు.

నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.ఇదిలా ఉంటే సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పర బాషా హీరోయిన్ గా చూడరు. తొలి తెలుగు తోనే మన అమ్మయే అనిపించుకుంది.ఫిదా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాగా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తే ఆమె పాత్ర కే హైలైట్ అవుతుంది. అంతే కాదు ఆ లో స్టార్ హీరో నటించినా కూడా సాయి పల్లవి వైపే అందరి కళ్లు వెళ్తాయి. ఆమె గురించే అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు సాయి పల్లవిని ఓ హీరో డామినేట్ చేశాడు. ఆహీరో ఎవరో కాదు అక్కినేని అందగాడు నాగ చైతన్య.సాయి పల్లవి నాగ చైతన్య కలిసి లవ్ స్టోరీ, రీసెంట్ గా తండేల్ ల్లో నటించారు. లవ్ స్టోరీ లో నాగ చైతన్య తన నటనతో ఆకట్టుకున్నాడు. కాగా రీసెంట్ గా విడుదలైన తండేల్ లో మాత్రం చైతూ అద్భుతంగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: