![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/comedian-prithviraj-healths-issuess-hosptal-join8e7a4251-9997-42f5-ae41-bf22dae2f920-415x250.jpg)
వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో కూడా లైలా సినిమాలో బాయ్కాట్ చేయాలంటూ పిలుపునివ్వడం జరిగింది.. ఈ నేపథ్యంలోనే ఆ నటుడు మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదంటూ అటు హీరో, నిర్మాతలు కూడా మీడియా ముందుకు వచ్చి మరి క్షమాపణలు తెలియజేశారు. అలాంటి సమయంలో కూడా సైలెంట్ గా ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడు ఒక్కసారిగా హాస్పిటల్ పాలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు హైబీపీ రావడంతో ఒక్కసారిగా ఆయన సన్నిహితులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారట.అందుకు సంబంధించి కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పృధ్వీరాజ్ గతంలో టీటీడీ ఎస్విబిసి భక్తి ఛానల్ కి చైర్మన్ పదవిగా కూడా ఉండేవారు. అయితే తనమీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో వైసిపి పార్టీ ఈయనను పక్కనపెట్టింది. దీంతో అప్పటినుంచి ఈయన వైసీపీ పార్టీ మీద పలు రకాల ఆరోపణలు చేస్తే ఒక్కసారిగా జనసేన పార్టీకి దగ్గర ఆ పార్టీలో చేరారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని.. గతంలో మెగా హీరోల పైన కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు వల్లే ఈయనకు సరైన అవకాశాలు రాలేదని కొంతమందిని డిజైన్ తెలియజేస్తూ ఉంటారు.. అందుకే ఈయన జనసేన పార్టీలో చేరారని కూడా సమాచారం.