![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/marokasari-guriji-midha-counter-vesian-poonam-koura60961b1-07aa-45ed-b462-a8d39a44d1ad-415x250.jpg)
గతంలో పవన్, త్రివిక్రమ్ మీద కూడా పలు రకాల కౌంటర్లు వేసిన ఈమధ్య పవన్ మీద కొంచెం మేరకు తగ్గించి త్రివిక్రమ్ పేరుని డైరెక్ట్ గానే పెట్టి మరి కౌంటర్లు వేస్తూ ఉన్నది.. తనని గురూజీ అంటూ నిత్యం ఏదో ఒక ట్విట్ చేస్తూనే ఉంటుంది పూనమ్. అయితే ఇప్పటివరకు ఎలాంటి విషయం పైన కూడా త్రివిక్రమ్ స్పందించలేదు. ఈ విషయం పైన కూడా ఎవరూ కూడా త్రివిక్రాన్ని ప్రశ్నించే అంత ధైర్యం కూడా చేయలేదని చెప్పవచ్చు.
అయితే ఇటీవలే ఒక ఇంగ్లీష్ సినిమాకు సంబంధించి సీన్ చూసి నెట్టిజెన్స్ మాట్లాడుకుంటూ ఉండగా ఈ సీన్ ని మన గురూజీ ఉన్నది ఉన్నట్టుగా లేపేశారు అంటూ నవ్వుతూ కౌంటర్లు వేసింది పూనమ్ కౌర్.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంత కారులోనే దుస్తులను మార్చుకొని సన్నివేశం హాలీవుడ్ నుంచి త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా ఈ సన్నివేశం గురించి పూనమ్ కౌర్ ఇలా కౌంటర్లు వేసినట్లు కనిపిస్తోంది. త్రివిక్రమ్ తన పాత సినిమాలన్నీ కూడా కాపీనే అంటూ ఎన్నో సందర్భాలలో బయటపడ్డాయి కొన్ని సన్నివేశాలను హాలీవుడ్ నుంచి కాపీ చేస్తారని కామెడీ ట్రాకులు అన్నీ కూడా హాలీవుడ్ నుంచి తీసుకుంటారని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కనిపిస్తోంది.