తండేల్ సినిమా విడుదలవ్వక ముందు నుండి నాగచైతన్య మూవీ యూనిట్ అందరూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతున్నారు.అలా ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్యకు మాజీ భార్య సమంత గురించి అలాగే శోభిత గురించి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే విడాకుల గురించి ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య తండేల్ ప్రమోషన్స్ లో కూడా క్లారిటీ ఇచ్చారు. మేము అన్ని ఆలోచించుకున్నాకే విడాకులు తీసుకున్నాం.. కానీ కొంతమందికి మా విడాకులు ఆనందంగా ఉన్నాయి.మా విడాకులను ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో రూమర్ల క్రియేట్ చేసారు.వాటిని ఇప్పటికైనా మానేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. 

ఇక విడాకుల గురించి నాగచైతన్య క్లారిటీ ఇస్తే సమంత మాత్రం తన సినిమాల సమయంలో ఏడుస్తూ సింపతి క్రియేట్ చేసేది అంటూ నాగచైతన్య మాటలు చూశాక చాలామంది సమంతపై ట్రోల్స్ చేశారు. అలాగే తండేల్ ప్రమోషన్స్ లో రెండో భార్య శోభిత ధూళిపాళ్ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆ పోస్టులో ఏముందయ్యా అంటే.. "మనిషి గా మీరు ఒక స్థిరమైన జీవి కాదు.కాబట్టి మీకు లైఫ్ లో ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండండి. మీ జీవితంలో ఏది స్థిరంగా ఉండదు" అంటూ ఒక కొటేషన్ షేర్ చేసింది.

 అయితే ప్రస్తుతం సమంత పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ నాగచైతన్య శోభితల బంధం గురించే సమంత అలా పరోక్షంగా పోస్ట్ చేసింది అని, ఈ మధ్యకాలంలో నాగచైతన్య తన గురించి మాట్లాడడం వల్లే సమంత ఇలా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత కామెంట్లను బట్టి చూస్తే నాగచైతన్య లైఫ్ లో శోభిత కూడా స్థిరంగా ఉండదు అన్నట్లుగా మాట్లాడినట్టు కొంతమంది సమంత పోస్ట్ ని వక్రీకరిస్తున్నారు. ఇక సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ ప్రస్తుతం అందరు మాత్రం శోభిత గురించే పెట్టిందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: