![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chiranjeevi-politices-not-interest-cine-indastry5dacf88e-0028-43e0-869b-cf19b08fe8f6-415x250.jpg)
అందుకు చిరంజీవి గెస్ట్ గా రావడం జరిగింది. బ్రహ్మానందం సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని అలాగే పొలిటికల్ పరంగా రీఎంట్రీ ఇస్తున్నాననే విధంగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్లాలనుకోలేదని పెద్దపెద్ద వారిని కలుస్తున్నారు ఏంటి అంటూ కొంతమంది సందేహ పడుతున్నారు అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు తాను ఉన్నంతకాలం కలమ్మ తల్లి సేవలోనే ఉంటానంటూ తెలిపారు. సినీ రంగానికి సేవలు కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నారని అంతకుమించి ఏమీ లేదు అంటూ తెలిపారు.
రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు సేవలను తన సోదరుడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని తెలిపారు. మొత్తానికి చిరంజీవి పొలిటికల్ పరంగా చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే జై జనసేన ,జై ప్రజారాజ్యం అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేయాలని చిత్ర బృందం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ రీ షూటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన తదుపరి చిత్రాల లైనప్ కూడా ఒకే లెవెల్లో చిరంజీవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు.