1980, 1990 దశకంలో ఎంతో మంది స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన హీరోలను సుమన్ కూడా ఒకరు.. బాలయ్య ,వెంకటేష్ ,చిరు, నాగార్జున వంటి హీరోలకు సమానంగా తన ఇమేజ్ ని సంపాదించుకున్నారు.. అయితే సుమన్ కెరీర్ కు బ్రేక్ పడింది నీలి చిత్రాల కేసు అని చెప్పవచ్చు. సుమన్ చాలా అందంగా ఉండడంతో చాలామంది అమ్మాయిలు కూడా తనని ఇష్టపడేవారట. ఫ్యామిలీ ఆడియన్సే కాకుండా యాక్షన్స్ అన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించగలరు. సుమన్ ని స్టార్ హీరో అవ్వకుండా ఇండస్ట్రీలో తొక్కేశారని ఇప్పటికి కూడా పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.


సుమన్ పై కొంతమంది హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్లాన్ చేసి మరి ఇబ్బందులు పెట్టినట్లు రూమర్లు వినిపిస్తూ ఉంటాయి.. గతంలో సుమన్ కేసులో కూడా చిరంజీవి పేరు కూడా ఎక్కువగా వినిపించింది.. కానీ సుమన్ ని ఇరికించడానికి ఒక ముఖ్యమంత్రి కి ఉన్న సంబంధం ఏంటి?.. చిరంజీవి పేరు వినిపించడానికి గల కారణం? ఏంటన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ విషయాన్ని గతంలో సుమన్ కి బెస్ట్ ఫ్రెండ్ అయినా వారిలో సాగర్ వెల్లడించారు వాటి గురించి చూద్దాం.




అయితే సుమన్ బ్లూ ఫిలిం కేసులో సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కి తెలిసే ఈ విషయం జరిగిందని విషయాన్ని తెలిపారు.. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉండగా రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్లలో ఒకరైన వడయార్ వల్లే సుమన్ జైలు పాలుఅయ్యరట. పక్క ప్లాన్ తోనే సుమన్ కి బెయిల్ రాకుండా కేసులు పెట్టించారని అది కూడా ఒక అమ్మాయి సుమన్ పైన మనసు పడటం వల్లే అన్నట్లుగా తెలిపారు. అప్పట్లో తమిళనాడు డీజీపీ కూతురు సుమన్ వెంటపడేదని.. అయితే ఆ అమ్మాయికి కూడా వివాహం అయ్యిందని అయినా సరే సుమన్ షూటింగ్ జరుగుతోందంటే చాలు అక్కడ ఎక్కువగా కనిపించేది.. కానీ సుమన్ కి ఆమె పైన ఎలాంటి అభిప్రాయం కూడా లేదని.. ఆ సమయంలోనే కాంట్రాక్టర్ వడయారు కూతురుని సైతం సుమన్ స్నేహితులలో ఒకరు ప్రేమించారట ఇలా సుమన్ కి అన్నీ కూడా వ్యతిరేకంగా రావడంతో.. అప్పట్లో ఈ విషయం ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజి రామచంద్ర వద్ద వరకు వెళ్లిందట.. ఈ విషయం పైన సుమన్ ని మద్దలించినప్పటికీ సుమన్ తన తప్పు లేదని డైరెక్ట్ గా చెప్పారని .. కానీ ఈ విషయం అప్పటి సీఎంకు సుమన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నచ్చకపోవడంతో సుమన్ పైన అల్లర్ల కేసు పెట్టడమే కాకుండా బ్లూ ఫిలిం కేసు కూడా పెట్టినట్లు వార్తలు వినిపించాయి.. కానీ అక్కడ అసలు కేసు పెట్టలేదని వెల్లడించారు సాగర్. అలా చేయని తప్పుకి సుమన్ కొన్ని నెలలు జైల్లో ఉండాల్సింది వచ్చిందట. సుమన్ అమ్మకి గవర్నర్ బాగా తెలియడంతో బెయిల్ మీద బయటకు వచ్చారట. అయితే సుమన్ అరెస్టు వెనక చిరంజీవి ఉన్నారనేది కేవలం రూమర్ అన్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: