టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..”ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.. నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలలో నటించిన ఆ సినిమా అందరిని ఆకట్టుకుంది.. ఆ సినిమా తరువాత టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్ తో మహానటి సావిత్రి గారి బయోపిక్ తెరకెక్కించారు.. మహానటి అనే టైటిల్ తో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. నాగ్ అశ్విన్ లో ఎంత మంచి దర్శకుడు వున్నాడో మహానటి సినిమా నిరూపించింది.. మహానటి సూపర్ హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు..

 డార్లింగ్ ప్రభాస్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీయాలని భావించిన నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీని సిద్ధం చేసాడు ఆ సినిమానే “ కల్కి 2898AD”.. గత ఏడాది రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రభాస్ కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ గా నిలిచింది..ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు పార్ట్ 2 తెరకెక్కించే పని లో వున్నాడు.. తాజాగా బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో నటించిన” బ్రహ్మ ఆనందం “ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు..అలాగే ఆ ఈవెంట్ కి నాగ్ అశ్విన్ సైతం హాజరయ్యారు.. 

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ భవిష్యత్ లో మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావాలని ఆయన కోరారు..మెగాస్టార్ నటించినసినిమాలలో “ చంటబ్బాయ్ “ సినిమా ఎంతో ఇష్టమని నాగ్ అశ్విన్ తెలిపారు..అలాగే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 త్వరగా పూర్తి చేయాలనీ యంగ్ గా వున్నప్పుడే ఎక్కువ సినిమాలు చేయాలనీ సూచించారు..ఆ బిగ్ మూవీ కంప్లీట్ చేసి తనతో చేసే సినిమా గురించి ఆలోచించమని మెగాస్టార్ కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: