![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mega-hero-saidarn-tej-comments-virla-politicesbf220d4a-c4f3-4221-9815-46a957f3ae80-415x250.jpg)
ముఖ్యంగా పొలిటికల్ విషయం పైన పరోక్షంగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ స్పందిస్తూ.. తను రాజకీయాల గురించి మాట్లాడనని తనను సినిమాలకు దూరం చేయవద్దంటూ ఒక రిక్వెస్ట్ ని సైతం తెలియజేస్తున్నారు. తాను వినోదం పంచడానికి మాత్రమే ఉన్నానని రాజకీయం అనేది చాలా పెద్దది.. దానిని ఇంకా నేర్చుకోవాలి.. తనకు బ్యాగ్రౌండ్ ఉందని ఫాలోయింగ్ ఉందని పొలిటికల్ లోకి రావడం కరెక్ట్ కాదు.. చాలా చదువుకోవాలి నేర్చుకోవాలి జనం సమస్యలు ఏంటో తెలుసుకోవాలి అంటూ తెలిపారు.
దయచేసి తనను సినిమాల నుంచి దూరం చేయకండి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి తాను పనిచేస్తానంటూ తెలిపారు. రేపు ఏంటన్నది ఆలోచన తనకు లేదని ఈ క్షణం బ్రతికేమా లేదా ఈ పూట భోజనం చేసామా లేదా అన్నది ఆలోచిస్తానని తెలిపారు చేతనైనంత సహాయం చేస్తాను ప్రస్తుతం ఇదే తన జీవన విధానం అంటూ తెలియజేశారు సాయి దుర్గ తేజ్.. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కి సంబంధించిన హామీలను కూడా ప్రచారంలో చాలామంది చేశారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక రాజకీయాలు వేరు సినిమాలు వేరు దూరం అంటూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు.